కేంద్రంపై దేశం ఎంపీలు ధ్వజం
హైదరాబాద్: రాష్ట్రానికి చెందినరైల్వే ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి పట్ల తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ (టిడిపిపి) తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. దీన్ని తీవ్రంగా పరిగణించాలని టిడిపిపి నిర్ణయించింది. ఆదివారం జరిగిన టిడిపిపి సమావేశం ఈ నిర్ణయానికి వచ్చింది. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో రాష్ట్రంలో పెండింగ్‌లో వున్నరైల్వే ప్రాజెక్టుల గురించి చర్చించేందుకుస్పీకర్ బాలయోగి ఛాంబర్‌లో సంబంధిత మంత్రి, అధికారులు, రాష్ట్ర పార్లమెంటు సభ్యులతో ఒక సమావేశం ఏర్పాటు చేయించాలని టిడిపిపి నిర్ణయించింది.రైల్వే ప్రాజెక్టుల పట్ల కేంద్ర చూపుతున్న నిర్లక్ష్య వైఖరిపై సమావేశంలో ఎంపిలు తీవ్రంగా ధ్వజమెత్తారు.
కాట్పాడి- తిరుపతిరైల్వే లైన్ గేజ్ మార్పిడి పనులకు నిధులు ఇవ్వడం లేదని చిత్తూరు పార్లమెంటు సభ్యుడు రామకృష్ణా రెడ్డి ప్రస్తావన తెచ్చారు. దీంతో ఇతర ఎంపీలు కూడా తమ తమ ప్రాంతాల్లోనిరైల్వే ప్రాజెక్టులపై సమావేశంలో ప్రస్తావన చేసి కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ధ్వజమెత్తారు. కాజీపేటలోని లోకో షెడ్డు నిర్మాణానికి నిధులు ఇవ్వడం లేదనేఅంశం ప్రస్తావనకు వచ్చింది. దీన్ని తూర్పు గోదావరి జిల్లాకు తరలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని, ఇది సమంజసం కాదని వరంగల్ జిల్లాకు చెందిన ఎంపీలు చాడసురేష్ రెడ్డి, బి. వెంకటేశ్వర్లు అన్నారు. దీనికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రతిస్పందిస్తూ-రైల్వే స్టాండింగ్ కుటీ చైర్మన్‌గా వుండి కూడా కేంద్రంపై ఎందుకు ఒత్తిడి తేలేకపోయారని ఎర్రంనాయుడును ప్రశ్నించినట్లు తెలిసింది.
తమ మాటను కేంద్ర మంత్రులు పట్టించుకోవడం లేదని ఎర్రంనాయుడు, తదితర ఎంపీలు ముఖ్యమంత్రికి చెప్పారు.రైల్వే మంత్రిగా ఎవరున్నా తమ సొంత రాష్ట్రానికి ప్రాధాన్యం ఇస్తున్నారని వారు చెప్పారు. దీనికి ముఖ్యమంత్రి ప్రతిస్పందిస్తూ-కేంద్ర మంత్రులు ఇలా వ్యవహరిస్తే ఇతర రాష్ట్రాల పరిస్థితి ఏం కావాలి? రాష్ట్రానికి అన్యాయం జరిగితే సహించేది లేదు. గతఅయిదేళ్లుగా రైల్వే బడ్జెట్‌లో మనకు అన్యాయం జరుగుతూనే వుంది. అటువంటప్పుడురైల్వే బడ్జెట్‌కు మనం తలలూపడం ఎందుకు? అని అన్నారు.












Click it and Unblock the Notifications
