ఉగ్రవాదంపై ఐక్యపోరు: పార్లమెంటు
న్యూఢిల్లీ: ప్రపంచ ఉగ్రవాద వ్యవస్థలపై ఐక్యంగా పోరాటం చేయాలని రాజ్యసభ సోమవారం ప్రపంచ సమాజాన్ని కోరింది. అన్ని ప్రాంతాల్లోని ప్రపంచ ఉగ్రవాద వ్యవస్థలను అంతం చేయడానికి ప్రపంచ సమాజం ముందుకు రావాలని రాజ్యసభ కోరింది.స్వేచ్ఛ, ప్రజాస్వామ్యాలపై జరుగుతున్న ఉగ్రవాద దాడులను ధ్వంసం చేయాలని అభిప్రాయపడింది.
ఉగ్రవాదం ఇవ్వాళ్ల అత్యంతపెద్ద సమస్యగా ముందుకు వచ్చిందని, ఉగ్రవాదాన్ని ధ్వంసం చేయడానికి ఐక్య పోరాటం అత్యవసరమని రాజ్యసభ చైర్మన్ కృష్ణకాంత్ అన్నారు. భారతదేశంలోని ఉగ్రవాద బాధితులకు, ప్రపంచంలోని ఇతర ప్రాంతాల ఉగ్రవాద బాధితులకు సభ హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తోందని ఆయన అన్నారు.
ప్రపంచ ఉగ్రవాద వ్యవస్థను ధ్వంసం చేయడానికి ప్రపంచమంతా ఏకం కావాలని లోక్‌సభ కూడా పిలుపునిచ్చింది. అమెరికాలోసెప్టెంబర్ 11వ తేదీన జరిగిన టెర్రరిస్టు దాడులను, భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్‌అసెంబ్లీపై జరిగిన దాడిని గుర్తు చేస్తూ- ఉగ్రవాదం అత్యంత ప్రమాదకరమైన సవాల్‌గా మారిందని లోక్‌సభస్పీకర్ జి.ఎం.సి. బాలయోగి అన్నారు.












Click it and Unblock the Notifications
