న్యూఢిల్లీ: భారత్‌లో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌ వైఖరిని అంతర్జాతీయ ప్రపంచానికి స్పష్టంగా చెప్పగలిగామని హోం మంత్రి ఎల్‌.కె. అద్వానీ చెప్పారు. సీమాంతర ఉగ్రవాదంపై మంగళవారం లోక్‌సభలో జరిగిన చర్చకు ఆయన సమాధానం ఇచ్చారు. ఉగ్రవాదాన్ని పాకిస్థాన్‌ పెంచి పోషిస్తున్న తీరును స్పష్టం చేయడంలో దౌత్య స్థాయిలో ఫలితం సాధించామని ఆయన అన్నారు. అఎn్ఘానిస్థాన్‌పై పోరులో అమెరికా పాకిస్థాన్‌కు దగ్గరయినా భారత్‌కు నష్టం ఏదీ లేదని ఆయన అన్నారు.


దేశంలో ఉగ్రవాదాన్ని అణచివేయడంలో ప్రభుత్వం ఫలమైందని ప్రతిపక్షాలు మంగళవారం లోక్‌సభలో తప్పుపట్టాయి. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని తీవ్రంగా దుయ్యబట్టాయి. జమ్మూ కాశ్మీర్‌అసెంబ్లీపై తీవ్రవాదులు దాడి చేసిన తర్వాత కూడా లష్కర్‌-ఎ-తోయిబాను అమెరికా నిషేధించేలా చేయడంలో వాజ్‌పేయి ప్రభుత్వం ఫలమైందని ప్రియరంజన్‌ దాస్‌ మున్షీ(కాంగ్రెస్‌) అన్నారు. ఉగ్రవాదం అణచివేతకు వాజ్‌పేయి ప్రభుత్వం అంతర్జాతీయ మద్దతును కూడగట్టలేకపోయిందని ఆయన దుయ్యబట్టారు. ప్రభుత్వం చేస్తున్న కృషి వల్ల ఉగ్రవాదం అణచివేతపై అంతర్జాతీయంగా పరిస్థితి భారత్‌కు అనుకూలంగా మారుతోందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+