హైదరాబాద్‌ః అనంతపురం జిల్లాలో అధికార తెలుగుదేశం పార్టీ నేతలు సాగిస్తున్న దౌర్జన్యకాండతో తమకు ప్రాణభయం ఏర్పడిందని ఆరోపిస్తూ అనంతపురం జిల్లాకు చెందిన కాంగ్రెస్, సిపిఎం నేతలు మంగళవారం నాడు హైదరాబాద్‌లో ప్రదర్శన జరిపారు.
జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు పాల్గొన్న ఈ ప్రదర్శనకు సిఎల్‌పి నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నాయకత్వం వహించారు. గాంధీభవన్‌నుంచి ఊరేగింపుగా వచ్చిన నేతలు సచివాలయానికి వెళ్లి ముఖ్యమంత్రిని కలవడానికి ప్రయత్నించగా ప్రధాన ద్వారం వద్దనేసెక్యురిటీ అధికారులు వారిని నిలిపివేశారు. జిల్లాల్లో ఈ మధ్యకాలంలో ప్రతిపక్షనేతలపై హత్యాకాండ చ్చలడిగా కొనసాగుతున్నదని దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని పక్ష నేతలుపేర్కొన్నారు. ప్రజాప్రతినిధులకు భద్రత కల్పించడం ప్రభుత్వం బాధ్యత అని వైఎస్ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications
