అయోధ్యపై సభలో రగడ
న్యూఢిల్లీః అయోధ్యపై పార్లమెంట్‌లో మంగళవారం నాడు తీవ్రస్థాయిలో రగడ జరిగింది. ప్రతిపక్ష సభ్యులు ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాన్ని లోక్‌సభ స్పీకర్ బాలయోగి తిరస్కరించారు. అయోధ్య ముఖ్యమైన అంశమే అయినప్పటికీ ఎజెండాలోని సభా కార్యక్రమాలను పక్కనబెట్టి వాటిని చేపట్టాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
సుప్రీం కోర్టు ఉత్తర్వులను ధిక్కరించి శ్వహిందూపరిషత్ కార్యకర్తలు అయోధ్యలో వాదాస్పద స్థలంలో వున్న మందిరంలోకి దూసుకుపోవడాన్ని ఖండిస్తూ పక్ష సభ్యులు వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించారు. రాజ్యసభలో కూడా జీరో అవర్‌లో అయోధ్య వ్యవహారంపై గొడవ జరిగింది.












Click it and Unblock the Notifications
