సచిన్, గంగూలీ,షెహవాగ్‌లకు శిక్ష
పోర్ట్ ఎలిజబెత్: భారత కెప్టెన్ సౌరబ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్‌తో సహా ఆరుగురు భారత క్రికెట్ క్రీడాకారులకు మ్యాచ్ రెఫరీ మైక్ డెన్నిస్ శిక్ష వేశారు. క్రికెట్ చరిత్రలోనే అసాధారణ రీతిలో ఆయన శిక్షలతో భారత క్రికెటర్లపై కన్నెర్ర చేశారు. బాల్ టాంపరింగ్‌కు పాల్పడ్డాడనే ఆరోపణపై సచిన్ టెండూల్కర్‌పై ఒక మ్యాచ్ సస్పెన్షన్, మ్యాచ్‌ఫీజులో 75 శాతం కోత ధించారు. అయితే మ్యాచ్ సస్పెన్షన్ నిర్ణయాన్ని వాయిదా వేశారు. దీంతో సచిన్ మూడో టెస్టులో పాల్గొనే అవకాశం వుంది. ఇదే తప్పును పునరావృతం చేస్తే మ్యాచ్ సస్పెన్షన్ నిర్ణయాన్ని అమలు చేస్తారు. ుతి dురిఅప్పీలు చేసినందుకు dరేంద్ర షెహవాగ్‌ను ఈ నెల 24న ప్రారంభం కానున్న మూడో టెస్టులో పాల్గొనకుండా సస్పెండ్ చేశారు.
ఆటగాళ్లను అదుపు చేయలేకపోయాడనేది కెప్టెన్ గంగూలీపై ఆరోపణ. ఆఫ్ స్పిన్నర్ హర్బజన్‌సింగ్, ఓపెనర్ శివసుందర్ దాస్, కెట్ కీపర్ దీప్ దాస్ గుప్తాలు ుతి dురిఅప్పీలు చేశారనేది ఆరోపణ. తన నిర్ణయాలను భారతటీమ్ మేనేజ్‌మెంట్‌కు మ్యాచ్ రెఫరీ మైక్ డెన్నిస్ తెలియజేసినట్లు సమాచారం. లండన్‌లోని ఐసిసి వర్గాలతో డెన్నిస్ సంప్రదింపులు జరుపుతున్నారు. ఒక దశలో సచిన్ చేసిన తప్పేdు లేదని డెన్నిస్ అన్నట్లు వార్తలు వచ్చాయి.
అపవాదుకు గురైన సచిన్ టెండూల్కర్‌ను కెప్టెన్ గంగూలీ, భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ వెనుకేసుకొచ్చారు. సచిన్ బాల్ టాంపరింగ్ వంటి అక్రమాలకు పాల్పడతాడనేది ఊహకుఅందని సంగతి అని వారన్నారు. సచిన్‌ది మచ్చ లేని క్రీడా జీతమని గంగూలీ అన్నాడు. బంతిపైపేరుకుపోయిన బురదను తొలగించడానికి మాత్రమే సచిన్ ప్రయత్నించి వుంటారని ఆయన అన్నాడు. బాల్ టాంపరింగ్ వంటీ తీవ్ర అక్రమాలకు సచిన్ పాల్పడతారని ఎలా ఊహించారని గవాస్కర్ అన్నారు. సచిన్‌అంటే తెలియని వారే ఇటువంటి ఆరోపణలు చేస్తారని భారత మాజీ క్రికెటర్ ర శాస్త్రి అన్నారు.
.












Click it and Unblock the Notifications
