ఇస్లామాబాద్: అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామాబిన్ లాడెన్‌ను పట్టిచ్చినవారికి అమెరికా 25 ులియన్ డాలర్ల నగదు బహుమతి ప్రకటించింది. లాడెన్ అమెరికా బలగాల కళ్లు గప్పి పాకిస్థాన్ dుదుగా పారిపోవచ్చుననే ఊహగానాలు చెలరేగిన నేపథ్యంలో దేశ సరిహద్దు జలాల్లోని పడవల్లో గాలింపు చర్యలు చేపట్టారు.
సముద్ర జలాల dుదుగా పారిపోవడానికి అవకాశం వున్న అన్ని ప్రాంతాల్లో గట్టి నిఘా ఏర్పాటు చేశారు. అమెరికా ఫిఫ్త్‌ఫ్లీట్ ఈ గాలింపు చర్యలను సోమవారంనాడు ప్రారంభించింది. ఈ గాలింపు అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు వుంటాయని అమెరికా మెరైనర్లను హెచ్చరించిందని పాకిస్థాన్ డైలీ ది నేషన్ రాసింది.
బిన్ లాడెన్ గానీ, ఆల్ ఖయిదా నాయకులు గానీ పారిపోవడానికి సహకరించేవారి వాహనాలనుస్వాధీనం చేసుకుంటామని, అలా సహకరించినవారిని నిర్బంధించి, వారికి జైలు శిక్ష వేస్తామని కూడా హెచ్చరించింది..












Click it and Unblock the Notifications
