హైదరాబాద్: మహిళలకు మంత్రివర్గాల్లో ప్రాధాన్యం లేని శాఖలు ఇస్తున్నారని రాజ్యసభ డిప్యూటీ చైర్ పర్సన్ నజ్మా హెప్తుల్లా అన్నారు. లక్ష్మిని, శక్తిని పూజించే మన దేశంలో మహిళలకు మంత్రి వర్గాల్లో ఆర్థిక, రక్షణ శాఖలు ఎందుకివ్వరని ఆమె ప్రశ్నించారు.
మహిళల సాధికారికత- ధానాలు అనేఅంశంపై మంగళవారం ఇక్కడ జరిగిన సదస్సులో ఆమె ప్రసంగించారు. మహిళలు ఏ శాఖనైనా సమర్థంగా నిర్వహించగలరని ఆమె అన్నారు. తీవ్రవాదం,పేదరికం, శాంతి భద్రతల వంటి సమస్యల వల్ల మహిళలే బాధులు పడుతున్నారని ఆమె అన్నారు.
కీలక రంగాల్లో మహిళలను భాగస్వాములను చేయాలని సదస్సు అభిప్రాయపడింది. మహిళలు ఆర్థికస్వేచ్ఛ సాధించేలా కృషి చేయాలని సదస్సు ప్రభుత్వాలను కోరింది.
.












Click it and Unblock the Notifications
