దాల్మియాదే నిర్ణయం: ప్రభుత్వం
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికా పర్యటన షయంలో నిర్ణయాధికారాన్ని ప్రభుత్వం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) అధ్యక్షుడు జగ్‌మోహన్ దాల్మియాకు వదిలేసింది. మాజీ క్రికెటర్, బిజెపి పార్లమెంటు సభ్యుడు కీర్తి ఆజాద్ నేతృత్వంలో పార్లమెంటులో మ్యాచ్ రెఫరీ మైక్ డెన్నిస్ నిర్ణయంపై తీవ్ర చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా పర్యటనను రద్దు చేసుకోవాలా, వద్దా అనే షయంలో నిర్ణయం తీసుకునే అధికారాన్ని దాల్మియాకు వదిలేసింది.
తదుపరి చర్చల ప్రసక్తి లేకుండా భారత జట్టును వెనక్కి పిలించాలని శివసేన, బిజెపి, తృణమూల్ కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ సౌరబ్ గంగూలీతో పాటు జట్టు సభ్యులు దక్షిణాఫ్రికా పర్యటన రద్దు చేసుకుని వెనక్కి రావడానికే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications
