ఫైజాబాద్: ఉత్తరప్రదేశ్‌లోని చక్కాఘాట్ దగ్గరలో వున్న ఘాంఘ్రా నదిలో గురువారంనాడు ఒక పడవ మునిగిపోవడంతోఅందులోని 35 మంది మరణించారని అనుమానిస్తున్నారు. నదిలోంచి 22 మృత దేహాలను వెలికి తీసినట్లు పోలీసులు చెప్పారు. ఒక వ్యక్తిని కాపాడగలిగినట్లు కూడా వారు తెలిపారు.
ప్రయాణికుల భారంపెరిగి అదుపు తప్పి పడవ నదిలో మునిగిపోయిందని వారన్నారు. సహాయ కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికిచేరుకున్నారు. మేకలను, పశు సంపదను కొనుగోలు చేయడానికి బాధితులు గోండా జిల్లాలోని పస్కా బజార్ నుంచి బయలుదేరారు.












Click it and Unblock the Notifications
