జార్జిపై ప్రతిపక్షాలు నిప్పులు
న్యూఢిల్లీ: రక్షణ శాఖ మంత్రి జార్జి ఫెర్నాండెజ్ మాట్లాడకుండా ప్రతిపక్షాలు అడ్డుకోవడంతో లోక్‌సభలో గురువారం తీవ్ర గందరగోళం చెలరేగింది. సభ రెండు సార్లు వాయిదా పడింది. రక్షణ కొనుగోళ్లలో దళారీ అక్రమాలపై ఒక ప్రశ్నకు జవాబు ఇవ్వడానికి రక్షణ మంత్రి జార్జి ఫెర్నాండెజ్ ప్రయత్నించినప్పుడు కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాల సభ్యులు తీవ్ర అభ్యంతరం చెప్పారు.
అక్రమ మార్గంలో మంత్రిగా వచ్చిన ఫెర్నాండెజ్ అక్రమాలపై జవాబు ఇవ్వకూడదని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. బిజెపి సభ్యుడు ఇదే సమయంలో ఒక అనుబంధ ప్రశ్న వేయడంతో గందరగోళం మరింత ఎక్కువైంది. ప్రశ్నోత్తరాల సమయాన్ని కొనసాగనివ్వాలనిస్పీకర్ బాలయోగి పదే పదే కోరినప్పటికీ ప్రతిపక్షాలు ఖాతరు చేయలేదు. దాదాపు 15 నిుషాల పాటు గందరగోళం చెలరేగింది. ఎంతకీ సద్దుమణగకపోవడంతోస్పీకర్ సభను వాయిదా వేశారు. ఈ గందరగోళం చెలరేగుతున్నంతసేపు ఫెర్నాండెజ్ మౌనంగా కూర్చున్నారు. సభ తిరిగి సమావేశమైన తర్వాత కూడా గందరగోళం చెలరేగింది. దీంతోస్పీకర్ బాలయోగి సభను శుక్రవారానికి వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications
