ఇద్దరు హైదరాబాద్ బందీలపై జస్వంత్
న్యూఢిల్లీ: వరల్డ్ ట్రేడ్‌సెంటర్‌పై, పెంటగాన్‌పై జరిగిన దాడి నేపథ్యంలోఅరెస్టయిన ఇద్దరు హైదరాబాదీలపై అమెరికా చట్టం తన పని తాను చేసుకుపోతుందని దేశాంగ శాఖ మంత్రి జస్వంత్ సింగ్ చెప్పారు. హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ జావేద్ అజ్మత్‌ను, అయూబ్ అలీఖాన్‌ను అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు అనుమానంతో అమెరికాలోఅరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరి అరెస్టుపై మొదటి సారి భారత ప్రభుత్వం మాట్లాడింది. వారిద్దరి కేసులో అమెరికా చట్టం తన పని తాను చేసుకుని పోవడాన్ని అమోదించాల్సిందేనని జస్వంత్ సింగ్ రాజ్యసభకు రాతపూర్వకంగా ఇచ్చిన ఒక సమాధానంలో చెప్పారు.
న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్‌సెంటర్‌పై జరిగిన దాడిలో భారత సంతతికి చెందినవారు 107 మంది కనిపించడం లేదని, వారందరూ దాడిలో మరణించి వుంటారని ఆయన అన్నారు. వారిలో చాలా మంది కార్పోరేట్,ఫైనాన్షియల్ కంపెనీల్లో పని చేసేవారని ఆయన చెప్పారు. భారత సంతతికి చెందిన 77 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొంది డిశ్చార్జి అయ్యారని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
