కాబూల్‌ః కాబూల్ మళ్ళీ రణంరంగంగా మారింది. రెండు వారాల కిందటే నార్తరన్ అలయెన్స్ ఆధిపత్యంలోకి వచ్చిన కాబూల్ లో గురువారంనాడు తాజాగా ఘర్షణలు చెలరేగినట్లు సమాచారంఅందింది. తాలిబన్ మద్దతు దారులు, నార్తరన్ అలయెన్స్ వర్గాల మధ్య కాబూల్ సdుపంలో హోరోహోరీ పోరాటం సాగుతున్నట్లు సమాచారంఅందింది.
కొత్త సర్కార్ కు సన్నాహాలు
ఆప్ఘనిస్తాన్ లో కొత్త సర్కార్ ఏర్పాటుకు నార్తరన్ అలయెన్స్, ఐక్యరాజ్య సుతి ప్రతినిధులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. బుధవారం వరకు కుందుజ్, కాంధహార్ లపై తాలిబన్ల పట్టు వున్నది. కుందుజ్ లో తాలిబన్లు లొంగిపోయేందుకు సంసిద్ధత వ్యక్తం చేయడంతో దాదాపు ఆప్ఘన్ అంతటా నార్తరన్ అలయెన్స్ పట్టు సాధించినట్లయింది.
ఆఫ్ఘనిస్తాన్ లో అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం వహించే ప్రభుత్వం ఏర్పాటుకు జర్మనీ లోనిబాన్ వేదిక కానుంది. త్వరలో ఆప్ఘన్ లోని అన్ని తెగల నాయకులతో అక్కడ సమావేశం ఏర్పాటు చేస్తారు. నిన్నటి వరకు తీవ్రమైన అణచివేతకుగురైన ఆఫ్ఘన్ మహిళలకు కూడా నూతన సర్కార్ లో ప్రాతినిధ్యం కల్పించాలనే నార్తరన్ అలయెన్స్ నిర్ణయం పట్ల అమెరికా హర్షం వ్యక్తం చేసింది. మరోవైపు కాందహార్ లో వున్న తాలిబన్లను లొంగదీసుకొనేందుకు నార్తరన్ అలయెన్స్ నేతలు చర్చలు జరుపుతున్నారు.












Click it and Unblock the Notifications
