హైదరాబాద్‌ః రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలోని జాపాల్ గ్రామసdుపంలోపీపుల్స్ వార్ నక్సలైట్లు అమర్చిన భారీ మందుపాతరలను పోలీసులు బుధవారం వెలికితీశారు. మంచాల నుంచి జాపాల్ వెళ్లే దారిలో నక్సలైట్లు మందుపాతరలు అమర్చారు. రోడ్డు మరమ్మతు పనులు చేస్తున్న కూలీలకు మందుపాతర కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. దీనితో పోలీసులు రంగప్రవేశం చేసి బుధవారం రాత్రి 9 గంటల వరకు జాగ్రత్తగా తవ్వకాలు జరిపారు. మూడు బకెట్లలో అమర్చిన భారీ మందుపాతర ను ఈ సందర్భంగా వెలికితీశారు. మరిన్ని మందుపాతరలు కూడా వుంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు.
చీకటి పడడంతో గురువారం నాడు తవ్వకాలు కొనసాగించాలని పోలీసులు నిర్ణయించారు.మంచాల ఎస్.ఐ.తో పాటు కానిస్టేబుల్ ను కూడా ఇటీవలేపీపుల్స్ వార్ నక్సలైట్లు ఈ ప్రాంతంలోనే హతమార్చారు. రాజధానికి కూతవేటు దూరంలో ఇంత భారీ మొత్తంలో మందుపాతర లభ్యం కావడం పోలీసు వర్గాల్లో కలకలం రేపింది.












Click it and Unblock the Notifications
