కాబూల్‌ఃఉత్తర ఆఫ్ఘనిస్తాన్ పట్టణంఅయిన కుందుజ్ లో భీకర పోరాటం జరుపుతున్న తాలిబన్లు లొంగిపోయేందుకు ఎట్టకేలకుఅంగీకరించారు. దీనితో దాదాపు మొత్తం ఆఫ్ఘనిస్తాన్ పై నార్తరన్ అలయెన్స్‌సేనలు పట్టు సాధించినట్లువుతుంది. వారంరోజులుగా అమెరికా బాంబు దాడులు, నార్తరన్ అలయెన్స్‌సేనల శతఘ్నుల దాడుల మధ్య తాలిబన్లు కుందుజ్ ను కాపాడుకుంటూ వచ్చారు. లొంగిపోతే క్షమాభిక్షప్రసాదిస్తామని నార్తరన్ అలయెన్స్‌సేనలు హాdు ఇచ్చాయి. అయినా తాలిబన్లు మొండికేశారు. ఇక తమ వల్ల కాదని నిర్దారణకు వచ్చిన తాలిబన్లు గురువారం ఉదయం నార్తరన్ అలయెన్స్ తో సంధి కుదుర్చుకున్నారు.
గురువారం ఉదయంలోగా లొంగిపోకపోతే ఊచకోత కోస్తామని నార్తరన్ అలయెన్స్‌సేనలు కుందుజ్ లో వున్న 20 వేలకు పైగా తాలిబన్లకు హెచ్చరించాయి. దీనితో తుదిగడువుకు తొద్దిసేపటికి ముందు తాలిబన్లు రాజీకి వచ్చాయి. ఐక్యరాజ్య సుతిబ్రిటన్ అధికారుల సమక్షంలో లొంగిపోతామని తాలిబన్లు షరతుపెట్టారు. ఈ వ్యవహారంలో తలదూర్చేది లేదని వారు చేతులెత్తేయడంతో తాలిబన్లు ధిలేక నార్తరన్ అలయెన్స్ కు లొంగిపోతామని ప్రకటించారు.












Click it and Unblock the Notifications
