హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటానికి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్లు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్‌కు చెందిన జిల్లా పరిషత్ చైర్మన్లు గురువారంనాడిక్కడ సమావేశమై తాము చేయాల్సిన పోరు గురించి చర్చించారు. అధికారాలను, నిధులను ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోందని నిరసిస్తూ వారు ప్రభుత్వానికి అల్టిమేటం ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. తమ పోరును నడిపించేందుకు గాను ఒక ఫోరమ్‌ను ఏర్పాటు చేయాలని వారు నిర్ణయించుకున్నారు.
జిల్లా పరిషత్ చైర్‌పర్సన్లకు అధికారాలు, నిధులు ఇవ్వకుండా కలెక్టర్లతో, నోడల్ అధికారులతో, ఇతర అధికారులతో ప్రభుత్వం కార్యక్రమాలు నిర్వహిస్తుండడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తారు. దీని గురించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు, సంబంధిత మంత్రికి శుక్రవారంనాడు మెమొరాండం ఇస్తామని వారు చెప్పారు. తమ డిమాండ్ పరిష్కారానికి ప్రభుత్వానికి గడువు ఇస్తామని, ఈ గడువు లోపల ప్రభుత్వం దిగిరాక పోతే ప్రత్యక్ష పోరుకు దిగుతామని వారు చెప్పారు. ఈ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్లు మూడు నెలల క్రితం ఎన్నికయ్యారు.












Click it and Unblock the Notifications
