హైదరాబాద్: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణపై కసరత్తు చేస్తున్నారు. శుక్రవారంనాడు తన అధికార కార్యక్రమాలను అన్నింటినీ రద్దు చేసుకుని మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణపై కసరత్తు ప్రారంభించారు. సామర్థ్యం, పనీతీరులపై ఆధారపడి కొత్త మంత్రులను తీసుకోవాలని, పాతవారికి ఉద్వాసన పలకాలని ఆయన నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మంత్రి వర్గంలోపెద్దగా మార్పులుండవని ఆయన సూచనప్రాయంగా చెప్పారు. మంత్రి వర్గ సభ్యుల సంఖ్య 36కు లేదా 37కుపైన పెరగకూడదని ఆయన నిశ్చయించుకున్నట్లు సమాచారం. ఆయన శుక్రవారం తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులతో చర్చలు జరిపారు. మంత్రి పదవుల కోసంసిఫార్సులతో వచ్చేవారిని ప్రోత్సహించబోమని ఆయన పార్టీ నాయకులతో చెప్పినట్లు సమాచారం.
చంద్రబాబునాయుడు తాను ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినప్పుడు తీసుకున్న మంత్రి వర్గంలో మార్పులు చేయలేదు. ఎ. మాధవరెడ్డి మరణించిన తర్వాత ఆయన స్థానంలో ఆయన సతీమణి ఉమామాధవరెడ్డికి మంత్రి వర్గంలో స్థానం కల్పించారు. ఇలా చూస్తే ఆయన మంత్రి వర్గ పునర్వ్యస్థీకరను పూర్తి స్థాయిలో చేపట్టడం ఇదే తొలిసారి. మంత్రి వర్గంలోపెద్దగా మార్పులు ఉండకపోవచ్చునని, మంత్రుల శాఖల్లోనే భారీగా మార్పులుంటాయనిఅంటున్నారు. ఈ నెల 26వ తేదీన మంత్రి వర్గాన్ని పునర్వ్యస్థీకరించిన అనంతరం చంద్రబాబు మళ్లీ శాసనసభ ఎన్నికలకు ముందు మాత్రమే మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణ చేపట్టే అవకాశాలున్నాయనిఅంటున్నారు.












Click it and Unblock the Notifications
