వైయస్ ప్రకటనపై పాల్వాయి గరం
హైదరాబాద్: కృష్ణా నదిపై ప్రభుత్వం తలపెట్టిన పులిచింతల ప్రాజెక్టుపై కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేత డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి ప్రకటన కాంగ్రెస్‌లో పొరపొచ్చాలకుదారి తీసింది. పులిచింతల ప్రాజెక్టును కాంగ్రెస్ శాసనసభ్యులు వ్యతిరేకించడం లేదని,పెద్ద ప్రాజెక్టులు నిర్మించినప్పుడు కొన్ని గ్రామాలు ముంపునకు గురికాక తప్పదని రాజశేఖర్ రెడ్డి గురువారం గుడివాడలో అన్నారు. దీంతో కాంగ్రెస్‌లోని ఒక వర్గం తీవ్రంగా మనస్తాపానికిగురైనట్లు నల్లగొండ జిల్లా కాంగ్రెస్ శాసనసభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి చేసిన ప్రకటన తెలియజేస్తోంది.
రాజశేఖర్ రెడ్డి ప్రకటనను ఆయన తప్పు పట్టారు. పులిచింతలపై రాజశేఖర్ రెడ్డి ఆ ప్రకటన చేయకుండా వుండాల్సిందని ఆయన అన్నారు. రాజశేఖర్ రెడ్డి ఆ ప్రకటన చేసి తెలంగాణ ప్రజలను మనస్థాపానికి గురి చేశారని ఆయన శుక్రవారం dుడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. పులిచింతల ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభించినప్పుడు గతంలో నల్లగొండ జిల్లా కాంగ్రెస్ సభ్యులు పనులను అడ్డుకున్నారు.












Click it and Unblock the Notifications
