చెన్నై: కేంద్రంలోని ఎన్‌డిఎ ప్రభుత్వానికిఅంశాల వారీ ప్రాతిపదికపై తాము మద్దతు ఇస్తామని అన్నాడియంకె నేత జయలలిత శుక్రవారం సూచనప్రాయంగా తెలియజేశారు.అంశాలపై మాత్రమే ఎన్‌డిఎకు తాము మద్దతివ్వడం అనేది ఆధారపడి వుంటుందని ఆమె చెప్పారు. పొటోపై కేంద్ర ప్రభుత్వాన్ని సమర్థిస్తారా అనే ప్రశ్నలకు ఆమె సమాధానం ఇస్తూ ఆ సంగతులు చెప్పారు.
తమ పార్టీసర్వ స్వతంత్రమైందని, తమ పార్టీ ప్రభుత్వానికిఅంశాల వారీ ప్రాతిపదికపై మద్దతు ఇవ్వవచ్చు లేదా వ్యతిరేకించవచ్చు అని జయలలిత అన్నారు. సమాజ్‌వాదీ పార్టీ, సిపిఎం ప్రారంభించినపీపుల్స్ ఫ్రంట్‌లో పాలు పంచుకుంటారా అని అడిగితేతాము ఏ ఫ్రంట్‌లోనూ వుండబోమని ఆమె సమాధానం ఇచ్చారు.
అయోధ్యలో రామాలయాన్ని నిర్మించాలనే హెచ్‌పి ప్రయత్నాల గురించి ప్రస్తావన తేగా అన్ని వర్గాలు సుప్రీంకోర్టు తీర్పునకు కట్టుబడి వుండాలని ఆమె స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications
