మంత్రి పోస్టుకు మేనక గుడ్‌బై
న్యూఢిల్లీ: మేనకా గాంధీ తాను కేంద్ర మంత్రి వర్గంలో వుండబోనని ప్రకటించారు. ఆమె ఒక ప్రయివేట్ టీd చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ షయం చెప్పారు. ఏ మాత్రం ప్రాధాన్యం లేని శాఖకు మంత్రిగా వుండడం కన్నా మంత్రి వర్గం నుంచి వైదొలగడమే మంచిదని అనుకుంటున్నట్లు ఆమె తెలిపారు.
ఆమెను సాంస్కృతిక వ్యవహారాల శాఖ నుంచి గణాంక వరాల శాఖకు మార్చారు. అంతకు ముందు సామాజిక న్యాయ శాఖ నుంచి సాంస్కృతిక వ్యవహారాల శాఖకు మార్చారు. ప్రస్తుతం తనకుఅప్పగించిన శాఖకు కార్యదర్శి గానీ, అధికారులు గానీ లేరని, చేయడానికి పని కూడా లేదని ఆమె అన్నారు. తాను మంచి పనులు చేయడం ప్రారంభించగానే తన శాఖను మారుస్తున్నారని, అనీతిపై చర్య తీసుకోవడానికి తాను సిద్ధం కాగానే శాఖ మార్పు జరుగుతోందని, ఈ స్థితిలో మంత్రి వర్గంలో వుండడం అవనసరమని తాను అనుకుంటున్నానని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications
