జనశక్తి నక్సలైట్ ఎన్‌కౌంటర్
కరీంనగర్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి చెన్నమనేని ద్యాసాగర్ రావు బావ మరిది మార్తాండరావు కిడ్నాప్ సంఘటనలో ప్రధాన పాత్ర పోషించిన ఒక నక్సలైట్ ఎన్‌కౌంటర్‌లో మరణించాడు.
శుక్రవారం మధ్యాహ్నం కరీంనగర్ జిల్లా చందుర్తి మండలం సనుగళ అడవుల్లో పోలీసులకు, జనశక్తి నక్సలైట్లకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఈ నక్సలైట్ మరణించాడు. మరణించిన నక్సలైట్‌ను సిపిఐ జనశక్తి డిప్యూటీ కమాండర్ మల్లేశంగా గుర్తించారు. మరో ఆరుగురు జనశక్తి నక్సలైట్లు పారిపోయారు. ఈ ఎన్‌కౌంటర్ శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో జరిగింది.












Click it and Unblock the Notifications
