న్యూఢిల్లీ: చరిత్ర పాఠ్యాంశాల మార్పుపై శుక్రవారం గందరగోళం చెలరేగి రాజ్యసభ వాయిదా పడింది. చరిత్ర పాఠ్యాంశాలను ప్రభుత్వం తాలిబనైజ్ చేస్తోందని, ఫాసిస్టు మాదిరిగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ సభ్యుడుఅర్జున్ సింగ్ చేసిన వ్యాఖ్య గందరగోళానికి దారి తీసింది.అర్జున్ సింగ్ వ్యాఖ్యకు బిజెపి సభ్యుడు చతుర్వేది తీవ్ర అభ్యంతరం తెలియజేశారు.
అర్జున్ సింగ్ అన్ పార్లమెంటరీ పదజాలం వాడారని, దాన్ని రికార్డుల నుంచి తొలగించాలని బిజెపి సభ్యులు డిమాండ్ చేశారు.అందుకు కాంగ్రెస్ సభ్యులు అంగీకరించలేదు. కాంగ్రెస్ సభ్యుడు ప్రణబ్ ముఖర్జీఅర్జున్‌సింగ్‌ను సమర్థించారు. దీంతో సభలో గందరగోళం చెలరేగిసద్దుమణగకపోవడంతో చైర్మన్ కృష్ణకాంత్ సభను వాయిదా వేశారు. తిరిగి సమావేశమైన తర్వాత కూడా గందరగోళం చెలరేగింది. దీంతో సభను ఆయన మర్నాటికి వాయిదా వేశారు. చరిత్ర పాఠ్యాంశాలను ప్రభుత్వం గుట్టు చప్పుడు కాకుండా మారుస్తోందని, దీనిపై పార్లమెంటరీ కుటీ వేయాలని సిపిఎం డిమాండ్ చేసింది. ప్రభుత్వంసెక్యులర్ ధానాలకు స్వస్తి చెప్పే మార్గాలను అనుసరిస్తే సహించబోమని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు ఎర్రంనాయుడు లేకరులతో అన్నారు.












Click it and Unblock the Notifications
