అనుభవాల ఆధారంగా పునర్‌వ్యవస్థీకరణ
హైదరాబాద్‌ః అన్ని షయాలను బాగా ఆలోచించే మంత్రివర్గాన్ని పునర్‌వ్యవస్థీకరించినట్టుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. సమర్ధవంతమైన టీమ్‌ను రూపొందించడం ప్రధాన ప్రాతిపదికగా తీసుకుని పునర్‌వ్యవస్థీకరణ చేపట్టినట్టుగా ఆయన చెప్పారు.
అదే సమయంలో అన్ని వర్గాలు, అన్ని ప్రాంతాలకు ప్రాతినిధ్యం లభించేలా సమతూకాన్ని కూడా సాధించినట్టు ఆయన చెప్పారు. మంత్రి పదవులు కోల్పోయిన వారు, మంత్రిపదవులు దక్కనివారికి పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా కీలకమైన బాధ్యతలు అప్పగించడానికి ప్రయత్నాలు సాగిస్తున్నామని ఆయన చెప్పారు. ఎవరి ఎక్కడ ఎలా ఉపయోగించుకోవాలో తమకు తెలుసునని ఆయన చెప్పారు.
ఇప్పుడు అదే షయంపై కసరత్తు చేస్తున్నట్టుగా ఆయన చెప్పారు. రెండేళ్ల తర్వాత మంత్రివర్గంలో మార్పులు చేసిన తాము మళ్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా మార్పు చేర్పులు చేయనున్నట్టుగా ఆయన వెల్లడించారు. న్యాయనిపుణులను సంప్రదించిన తర్వాతనే కోడెలకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలన్న నిర్ణయం తీసుకున్నట్టుగా ఆయన వెల్లడించారు. త్వరలోనే డిప్యూటీ స్పీకర్, కార్పొరేషన్ పదవులను భర్తీ చేయనున్నట్టుగా ఆయన వెల్లడించారు. ఈ సారి మంత్రివర్గ స్తరణలో తాము అనేక షయాలను పరిగణలోకి తీసుకున్నామని అన్ని వర్గాల నేతలతో నాలుగురోజుల పాటు స్తృతంగా మంతనాలు జరిపామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications