మజారే షరీఫ్‌లో నరమేధం
ఇస్లామాబాద్‌ః అలయన్స్ దళాలు స్వాధీనం చేసుకున్న తాలిబన్ల కంచుకోట మజారే షరీఫ్‌లో సోమవారం నాడు అమెరికా సైనికులు, అలయన్స్ బలగాలు నరమేధానికి తెగబడ్డాయి. లొంగిపోయిన వందలాది మంది తాలిబన్ సైనికులను తిరుగుబాటు ప్రయత్నం చేశారనే ఆరోపణతో కాల్చిచంపారు.
తాలిబన్ సైనికులను బంధించిన బంకర్లపై అతితక్కువ ఎత్తునుంచి అమెరికా యుద్ధ మానాలు బాంబుల వర్షం కురిపించాయి. సుమారు 400 మంది తాలిబన్ సైనికులు మరణించినట్టుగా అమెరికా వర్గాలు చెబుతున్నప్పటికీ మృతుల సంఖ్య ఇంకా ఎక్కువే వుంటుందని అంటున్నారు. తాలిబన్ సైనికులు తిరుగుబాటు ప్రయత్నాన్ని తీవ్రంగా పరిగణించిన అమెరికా తీవ్రస్థాయిలో దీనిని అణిచివేసినట్టుగా అధికారులు చెప్పారు. కాగా ఈ సంఘటనపై పాకిస్తాన్ తీవ్ర నిరసన ప్రకటించింది. లొంగిపోయిన వారిని అంతర్జాతీయ చట్టాల ప్రకారం చారించేలా ఆదేశాలు జారీ చేయాలని ఐక్యరాజ్యసుతిని పాకిస్తాన్ కోరింది. ఇదిలా వుండగా మజారేషరీఫ్‌లో జరిగిన మారణకాండకు ప్రతీకారం తీర్చుకోవడం ఖాయమని తాలిబన్ నాయకులు ప్రకటించారు.












Click it and Unblock the Notifications