150 మంది మావోయిస్టుల హతం

ఖాట్మండు: నేపాల్‌లో హింసాత్మక సంఘటనలు కొనసాగుతూనే వున్నాయి. తాజాగా జరిగిన సంఘటనలోపెద్ద యెత్తున హింస చెలరేగింది. నేపాల్‌ మావోయిస్టులు సొలుకుంభ్‌లోని జిల్లా పరిపాలనా భవనంపై ఆదివారం రాత్రిపెద్ద యెత్తున దాడి చేశారు. ఈ దాడిలో ఒక ఉన్నతాధికారి, 11 మంది భద్రతా జవాన్లు మరణించారు. ప్రభుత్వ బలగాల ఎదురుదాడిలో 150 మంది నేపాల్‌ మావోయిస్టు తిరుగుబాటుదారులు హతమయ్యారు.

ప్రభుత్వ బలగాలకు, గెరిల్లాలకు మధ్య జరిగిన హోరాహోరి పోరులో 150 మంది మావోయిస్టులు హతమయ్యారని హోం శాఖ మంత్రి దేవేంద్ర రాజ్‌ కండేల్‌ చెప్పారు. ఎదురుకాల్పులు సోమవారం ఉదయం వరకు కొనసాగాయి.

తిరుగుబాటుదారులు మొదట ఫల్పు ఎయిర్‌పోర్టు టవర్‌ను ధ్వంసం చేశారు. ఆ తర్వాత ఆదివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత సొలుకుంభు జిల్లా పాలనా కార్యాలయంపై దాడి చేశారు. గెరిల్లాలు జిల్లా ప్రధాన పాలనాధికారి బుద్ధిసాగర్‌ త్రిపాఠి ఇంటిపై దాడి చేసి ఆయనను కాల్చి చంపారు. వ్యవసాయాభివృద్ధి బ్యాంక్‌ నుంచి, రాష్ట్రీయ బనియా బ్యాంక్‌ నుంచి కోటీఇరవై లక్షల రూపాయల ఖరీదు చేసే నగదను, బంగారాన్ని దోచుకెళ్లారు.

ఖాట్మండులోని బాగ్‌బజార్‌ నుంచి పోలిట్‌బ్యూరో సభ్యుడు రdంద్ర శ్రేష్ట, ఆయన భార్య సహా 20 మంది మావోయిస్టు కార్యకర్తలను ఆదివారం రాత్రిఅరెస్టు చేశారని స్థానిక రేడియో కాంటిపూర్‌ ఎఫ్‌ఎం ప్రకటించింది. అయితే, ఈఅరెస్టులను ప్రభుత్వం ధృdకరించలేదు. కొన్నిఅరెస్టులు మాత్రం జరిగాయని ప్రభుత్వం అంటోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+