పాఠ్యాంశాల్లో మార్పుపై దుమారం
న్యూఢిల్లీః హైస్కూల్ తరగతుల చరిత్ర పుస్తకాల్లో మార్పులు చేయాల్సిందిగా ఎన్‌సిఇఆర్‌టి జారీచేసిన ఆదేశాలపై పార్లమెంట్‌లో సోమవారం నాడు తీవ్రస్థాయిలో దుమారం చెలరేగింది. ఈ ఆదేశాల మేరకు చరిత్ర పాఠ్యపుస్తకాల్లో మార్పులు చేయడాన్ని పక్షాలు తీవ్రంగా మర్శించాయి.
అధికార, ప్రతిపక్ష సభ్యులు తీవ్రస్థాయిలో పరస్పరం దుమ్మెత్తిపోసుకున్నారు. ద్యను తాలిబనీకరిస్తున్నారంటూ ప్రతిపక్ష సభ్యులు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయగా గోబెల్స్ ప్రచారానికి దిగుతున్నాయంటూ ప్రతిపక్షాలపై అధికారపక్షం నిప్పులు కురిపించింది. కొందరు ప్రముఖుల గురించి చరిత్రలో నిజంగానే తప్పులు వస్తే వాటిని తొలిగించడం సమర్ధనీయమేనని అయితే ప్రభుత్వం ఎంచుకున్న మార్గం మాత్రం సరైంది కాదని కాంగ్రెస్ పేర్కొంది. ఈ వ్యవహారంపై సభలో చర్చ జరపాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అయితే ప్రభుత్వం తన చర్యను గట్టిగా సమర్ధించుకున్నది. దాంతో కాంగ్రెస్ సభనుంచి వాకౌట్ చేసింది. ఆ తర్వాత అధికార పక్షంతో తీవ్రస్థాయిలో వాగ్యుద్ధానికి దిగిన ఆర్‌జెడి, ఎస్‌పి, వామపక్షపార్టీల సభ్యులు కూడా నిరసనగా వాకౌట్ చేశారు. సభ్యుల నియమావళి గురించి ప్రవర్తన గురించి మాట్లాడుకుని 24 గంటలకు కాకముందే మళ్లీ కథ మొదటికి రావడం పట్ల స్పీకర్ బాలయోగి పదేపదే ఆవేదన వ్యక్తం చేసినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదు.












Click it and Unblock the Notifications