లాలూకు 15 రోజుల రిమాండు
రాంచిః రాష్ట్రీయ జనతాదళ్ అధినేత బీహార్ ముఖ్యమంత్రి దాణా స్కామ్‌లో నిందితుడై లాలూ ప్రసాద్ బెయిల్ పిటిషన్‌ను సిబిఐ స్పెషల్ కోర్టు తిరస్కరించింది. ఆయన్ను పదిహేను రోజుల పాటు జుడిషియల్ కస్టడీకి పంపిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. లాలూతో పాటు స్కామ్‌లో మరో నిందితుడైన ఇంకో మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ ుశ్రా బెయిల్ పిటిషన్‌ను కూడా కోర్టు తిరస్కరించింది.
లాలూప్రసాద్ యాదవ్‌ను రిమాండ్ నిుత్తం రాంచీలోని బేకన్ ఫ్యాక్టరీ గెస్ట్‌హౌస్‌లో వుంచుతారు. సోమవారం నాడులాలూ సిబిఐ ప్రత్యేక కోర్టు ముందు లొంగిపోయారు. ఆయనతో పాటు బీహార్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ ుశ్రా కూడా కోర్టు ఎదుట లొంగిపోయారు. దాణా స్కామ్ కేసులో ఈ ఇద్దరు నేతలతో పాటు మొత్తం 108 మందిపై చార్జిషీట్ దాఖలు చేశారు. కోర్టులో లొంగిపోవడానికి లాలూ పాట్నా నుంచి మందిమార్బలంతో భారీ ఎత్తున బయలుదేరి రాంచీ వచ్చారు.












Click it and Unblock the Notifications