నిరాడంబరంగా ప్రమాణస్వీకారం
హైదరాబాద్‌ః కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణలో మంత్రివర్గంలో స్థానం లభించిన 11 మంది కొత్త మంత్రులు సోమవారం నాడు మధ్యాహ్నం రాజ్‌భవన్‌లో నిరాడంబరంగా జరిగిన ఒక కార్యక్రమంలో గవర్నర్ రంగరాజన్ కొత్త మంత్రులచే ప్రమాణ స్వీకారం చేయించారు.
అందరికంటే ముందుగా నెల్లూరుకు చెందిన చంద్రమోహన్‌రెడ్డి కేబినెట్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, జెఆర్ పుష్పరాజ్, రామసుబ్బారెడ్డి, కోడెల, శ్రీనివాసయాదవ్ కేబినెట్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.
దామచర్ల ఆంజనేయులు, ఎం దామోదర్‌రెడ్డి, సుద్దార దేవయ్య. పి నారాయణస్వాు నాయుడు, పి రాములు సహాయ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసారు. కొత్త మంత్రుల ప్రమాణస్వీకార వేడుకల కారణంగా రాజ్‌భవన్‌రోడ్ సోమవారం ఉదయం నుంచే సందడిగా మారింది.












Click it and Unblock the Notifications