కొండపాకః మెదక్ జిల్లా దొమ్మాట నియోజకవర్గం శాసనసభ్యుడు చెరుకు ముత్యంరెడ్డి ఇంటిని మంగళవారం నాడు పీపుల్స్‌వార్ నక్సలైట్లు పేల్చివేశారు. ఆస్తులను ధ్వంసం చేశారు. తుక్కాపూర్ గ్రామంలోని ముత్యంరెడ్డి కుటుంబానికి చెందిన రెండంతస్తుల భవనాన్ని బకెట్ బాంబులతో నక్సల్స్ పేల్చివేశారు.
మొత్తం ఐదు బకెట్ బాంబులను అమర్చగా మూడు మాత్రమే పేలాయి. భవనం భారీగా దెబ్బతిన్నది. ట్రాక్టర్ పాక్షికంగా ధ్వంసం అయింది. భవనం కిందిభాగంలో వున్న కోళ్ల దాణాషెడ్ దక్షిణం వైపున్న గోడ కొంతభాగం కూలిపోయింది. కోళ్లషెడ్‌ను ధ్వంసం చేయడానికి విసిరిన బాంబు పేలకపోవడంతో ప్రమాదం తప్పింది. గిరాయిపల్లి దళం నక్సల్స్ ఈ సంఘటనకు బాధ్యులుగా తెలిసింది.












Click it and Unblock the Notifications
