చిన్న శ్రీనుకు పెద్ద షాకులు ? మంత్రిని చేస్తే గవర్నర్ పోస్టుకు పెద్దాయన గుడ్ బై?
ఏపీలో స్దానిక సంస్ధల ఎన్నికల వేళ వైసీపీ కీలక నేత బొత్స సత్యనారాయణ మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు (majji srinivasarao)అలియాస్ చిన్న శ్రీను పార్టీని వీడి టీడీపీలో చేరిపోయారు. కుమార్తె సహస్రతో కలిసి ఆయన తాజాగా టీడీపీ కండువా కప్పుకున్నారు. స్ధానిక సంస్ధల ఎన్నికల్లో కుమార్తె సహస్రకు విజయనగరం జిల్లా జడ్పీ ఛైర్ పర్సన్ పోస్టు ఇప్పించుకునే ఉద్దేశంతోనే ఆయన పార్టీ మారి ఉంటారని ముందుగా భావించినా, ఆ తర్వాత ఆయనకు కీలక హామీ లభించడం వల్లే ఇలా చేశారని అర్ధమవుతోంది. అదే ఇప్పుడు ఆయన కొంప ముంచేలా కనిపిస్తోంది.
వైసీపీలో విజయనగరం జిల్లా అధ్యక్షుడు, భీమిలి నియోజకవర్గ ఇన్ ఛార్జ్ తో పాటు మొత్తం మూడు పదవులు అనుభవిస్తున్న మజ్జి శ్రీను ఇవన్నీ వదులుకుని టీడీపీలో చేరడం వెనుక కీలక హామీలే లభించినట్లు తెలుస్తోంది. ఇందులో కుమార్తెకు జడ్పీ ఛైర్ పర్సన్ తో పాటు తనకు ఎమ్మెల్సీ, మంత్రి పదవి హామీ కూడా తీసుకున్నట్లు సమాచారం. అయితే ఇప్పుడు ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి, మంత్రిని చేయడంపై విజయనగరం జిల్లా టీడీపీలో అభ్యంతరాలు మొదలయ్యాయి. ముఖ్యంగా విజయనగరం వదిలేసి గోవా గవర్నర్ పదవి తీసుకున్న టీడీపీ పెద్దాయన అశోక్ గజపతి రాజు సైతం మజ్జి శ్రీనుకు పదవి ఇవ్వొద్దని కోరుతున్నట్లు తెలుస్తోంది.

అయితే ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేస్తామనే హామీతో వైసీపీ నుంచి తమ పార్టీలోకి తెచ్చుకున్న మజ్జి శ్రీనివాసరావుకు ఇవాళ కాకపోతే రేపు అవి ఇచ్చే అవకాశం ఉండటంతో అశోక్ గజపతిరాజు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే తాను గోవా గవర్నర్ పదవికి రాజీనామా చేస్తానని కూడా అశోక్ చంద్రబాబుకు చెప్పేసినట్లు సమాచారం. దీంతో మజ్జి శ్రీనివాసరావు విషయంలో ఏం జరగబోతోందన్న ఆయన అనుచరుల్లో టెన్షన్ పెరుగుతోంది. మరోవైపు ఆయన వైసీపీ నుంచి టీడీపీకి వచ్చినా, క్యాడర్ మాత్రం బొత్సను వీడి రాలేదు. అదే సమయంలో టీడీపీలో తనకు అవమానాలు ఎదురైతే ఆయన భవిష్యత్ రాజకీయం ఎలా ఉండబోతోందన్నది కూడా ఉత్కంఠ రేపుతోంది.














Click it and Unblock the Notifications
