చెన్నైః ఇంధనం కోసం చెన్నై తీరంలో నిలిచిన అమెరికా యుద్ధవాహక నౌక నుంచి హఠాత్తుగా బయలుదేరిన ఒక హెలికాప్టర్ రెండు గంటల పాటు చెన్నై గగన తలంలో చక్కర్లు కొట్టింది. రక్షణ పరంగా అత్యంత కీలకమైన కల్పకం అణు విద్యుత్ కేంద్రం పరిసరప్రాంతాలపై ఈ హెలికాప్టర్ విహరించింది.
కల్పకంలోనే ఇందిరాగాంధీ
అణుపరిశోధన సంస్థ కూడా వుంది. ఇది నిషిద్ధ ప్రాంతం కావడంతో ఈ ప్రాంతంలో విదేశీ హెలికాప్టర్ తిరగడాన్ని గూడచార్యం నిమిత్తమే అయివుంటుందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయాన్ని భారత్ తీవ్రంగా పరిగణిస్తున్నట్టుగా అధికారులు చెప్పారు. అఎn్గాన్ యుద్ధ నేపథ్యంలో అమెరికన్ యుద్ధ విమానాలు చెన్నై రేవులో నిలిచేందుకు, ఇంధనం నింపుకునేందుకు భారత ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ నెల 5న చెన్నై తీరానికి చేరిన యుఎస్‌ఎస్ ఓ బ్రయాన్ ఇక్కడి హార్బర్‌కు చేరుకున్నది.
సోమవారం నాడు మరో యుద్ధవాహక నౌక జాన్ యంగ్ కూడా వచ్చింది. ఈ నౌకనుంచే ఒక హెలికాప్టర్ బయలుదేరి చెన్నై గగనతలంలోకి ప్రవేశించింది. అయితే హెలికాప్టర్ రొటీన్ ఎక్సర్‌సైజ్‌లో భాగంగానే చెన్నై గగనతలంలో తిరిగినట్టుగా జాన్‌యంగ్ కాప్టెన్ జాఫ్రీ పేక్ చెప్పారు. భారత గగనతలంలో తిరిగే ముందు స్థానికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులకు చెప్పాలన్న విషయం తమకు తెలియదని ఆయన అన్నారు. అయితే ఈ విషయం అమెరికా దృష్టికి తీసుకువెళ్లనున్నట్టుగా భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఇదిలా వుండగా విదేశీ హెలికాప్టర్ రెండు గంటలపాటు చెన్నై గగనతలంలో చక్కర్లు కొడుతున్నా భారత నౌకాదళం, వైమానిక దళం అప్రమత్తం కాకపోవడం పట్ల విమర్శలు వినవస్తున్నాయి.












Click it and Unblock the Notifications
