రాంచిః రాంచీలోని హోత్వార్ గ్రామంలోని బాకన్ ఫ్యాక్టరీ అతిధి గృహాన్ని జైలుగా మార్చి ఇద్దరు బీహార్ మాజీ ముఖ్యమంత్రులు లాలూ, జగన్నాథ్ మిశ్రాలను అక్కడ వుంచారు.
పేరుకు జైలు అయినప్పటికీ ఈ ఇద్దరు నేతలకు అక్కడ ప్రభుత్వ అధికార అతిధిగృహంలో జరిగే మర్యాదలన్నీ సాగుతున్నాయి. టీవీలు, ఫోన్ల వంటి సౌకర్యాలు అందుబాటులో వుంచారు.
విడివిడిగా ఆఫీసు గదులను కేటాయించారు. పడుకోవడానికి ప్రత్యేకంగా బెడ్‌రూమ్స్ కేటాయించారు. ఇక వంటింట్లో యిష్టమైన వంటకాలు వండుకుతినడానికి సకల ఏర్పాట్లు, దినుసులు సిద్ధంగా వుంచారు. జైలు నిబంధనలను పట్టించుకోకుండా లాలూ అర్ధాంగి బీహార్ ముఖ్యమంత్రి రబ్రీదేవీ పదేపదే జైలుకు వచ్చి గంటలు గంటలు గడుపుతున్నా పోలీసు సిబ్బంది నిస్సహాయంగా వుండిపోతున్నారు.












Click it and Unblock the Notifications
