వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైదరాబాద్‌ః అర్చకుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కక్ష సాధింపు చర్యలకు నిరసనగా కార్తీక పౌర్ణమి పర్వదినం శుక్రవారం నాడు రాష్ట్రవ్యాప్తంగా వున్న వేలాది దేవాలయాల్లో అర్చకులు ఆత్మావలోకన దినాన్ని పాటించారు.

By Staff
|
Google Oneindia TeluguNews

గ ప్రాతఃకాల అర్చనలు ముగించి స్వామివారికి నైవేద్యం సమర్పించి గర్భగడికి తాళాలు వేశారు. మంచి ఆదాయం వున్న దేవాలయాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని తరతరాలుగా అర్చకులుగా వున్న వారికి పదవీవిరమణ వయస్సు నిర్ధారించి నోటీసులు పంపడం అర్చకలోకం నిరసనకు ప్రధాన కారణం. చాలా ప్రాంతాల్లో అర్చకుల నిరసనకు భక్తుల మద్దతు కూడా లభించింది. అర్చకులు ఈ విధంగా నిరసన ప్రకటించడం రాష్ట్రంలో ఇది రెండో సారి.

గతంలో ఎన్‌టిఆర్‌ ముఖ్యమంత్రిగా వున్న సమయంలో కూడా అర్చకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి సూర్యదేవాలయంలో, గుంటూరు జిల్లా పెదకాకాని గణపతి దేవాలయంలో అర్చకులకు అధికారులకు మధ్య తీవ్రవాగ్వివాదం జరిగినట్టు వార్తలు అందాయి. శ్రీకాకుళం, ఉత్తరాంధ్రలో 160 దేవాలయాలు మూతపడ్డాయి. అర్చకుల ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న ప్రొఫెసర్‌ సౌందరరాజన్‌ అర్చకులుగా వున్న రంగారెడ్డి జిల్లా చిల్కూరు బాలాజీ ఆలయాన్ని యాదగిరి గుట్టకు అనుసంధానం చేస్తూ ప్రభుత్వం స్వాధీనం ఉత్తర్వులు జారీ చేయడం వివాదాస్పదంగా మారింది. చిల్కూరు బాలాజీ ఆలయం స్వాధీనాన్ని చిల్కూరు గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X