కరీంనగర్‌ః భారత దేశాభివృద్ధికి ప్రవాసభారతీయులు ఇతోధికంగా కృషి చేయాలని కేంద్ర హోం శాఖ మంత్రి ఎల్.కె. అద్వానీ పిలుపునిచ్చారు. ప్రవాస భారతీయులు 50 కోట్ల రూపాయలతో కరీంనగర్ లో చేపట్టిన ప్రతిమా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్‌సైన్సెస్ (పిమ్స్) ను అద్వానీ ఆదివారం నాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా అద్వానీ మాట్లాడుతూ చైనా వంటి దేశాలతో పోల్చితే భారత దేశాభివృద్ధిలో ప్రవాస భారతీయుల పాత్ర అభినందనీయంగా లేదని అద్వానీ అన్నారు. ఇందుకు ప్రవాసభారతీయుల్ని తప్పుపట్టడం లేదని ఆయన అన్నారు. ఎన్.ఆర్. ఐ.లను ప్రోత్సహించి, వారు మాతృదేశాభివృద్ధిలో పాలు పంచుకొనేలా చేయలేకపోయిన తప్పు మనదేనని అద్వానీ అన్నారు.

మెడికల్ కాలేజీ భవనాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ జన్మభూమి స్ఫూర్తితో ప్రవాస భారతీయులు వైద్య రంగం అభివృద్ది కృషి చేయడం అభినందనీయమన్నారు. మారుమూల ప్రాంతాల్లో వైద్య రంగం అభివృద్దికి అన్ని విధాలా కృషి చేయాల్సిన అవసరం వున్నదన్నారు. ఇంత భారీ వ్యయంతో కరీంనగర్ లో పిమ్స్ ఏర్పాటు చేయడం పట్ల కేంద్ర హోం శాఖ సహాయ మంత్రివిద్యాసాగర్ రావు హర్షం వ్యక్తం చేశారు.

Click it and Unblock the Notifications