హైదరాబాద్‌ః క్రమశిక్షణలేని రాజకీయం ఎక్కువకాలం మనలేదని రాష్ట్ర హోం శాఖ మంత్రి దేవేందర్ గౌడ్ అన్నారు. శనివారం నాడు కాంగ్రెస్ పార్టీసర్వసభ్య సమావేశం కదనరంగంగా మారిన సంఘటన రాజకీయ పార్టీలన్నింటికీ గుణపాఠమని, ఇటువంటి పార్టీలను ప్రజలు ఆదరించరని ఆయన ఆదివారం తెలుగుదేశం శిక్షణా శిబిరంలో అన్నారు. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన పార్టీ సమన్వయకర్తల శిక్షణా శిబిరాన్ని ఉద్దేశించి దేవేందర్ గౌడ్ ప్రసంగించారు.
గాంధీభవన్ లో కాంగ్రెస్ పార్టీసర్వసభ్య సమావేశం ఏకంగా కదన రంగం కావడాన్ని గౌడ్ ఈ సందర్భంగా ప్రముఖంగా ప్రస్తావించారు. క్రమశిక్షణకు వున్న ప్రాధాన్యాన్ని గుర్తించిన తెలుగుదేశం పార్టీ శిక్షణను తప్పని సరి చేసిందని అన్నారు.క్రమశిక్షణ లేని రాజకీయాన్ని ప్రజలు ఈ హైటెక్ యుగంలో ఆదరించరని గౌడ్ అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications