దేవాదులపైఅసెంబ్లీలో రగడ
హైదరాబాద్ : ప్రభుత్వం వరంగల్ జిల్లా దేవాదులలో నిర్మింపతలపెట్టిన భారీ నీటిపారుదల ప్రాజెక్టుక నిర్మాణ పనులు ఇప్పటికీ ప్రారంభించక పోవటంపై బుధవారం నాడు అసెంబ్లీలో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డాయి. స్ధానిక సంస్ధల ఎన్నికలలో ప్రజలను మభ్య పట్టేందుకే ప్రభుత్వం హడావిడిగా దేవాదుల ప్రాజెక్టుకు శంఖుస్ధాపన చేసిందని, ఎన్నికలు ముగిసిన తరువాత తెలంగాణా ప్రజలను మోసం చేస్తున్నదని టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే చంద్రశేఖరరావు విరుచుకుపడ్డారు.
చంద్రశేఖరావుకు సిపిఐ(ఎం), కాంగ్రెస్ సభ్యులుకూడా మద్దతు పలుకుతూ ప్రభుత్వంపై తీవ్రస్ధాయిలో దాడికి దిగటంతో సభలో ఉద్రిక్తత నెలకొంది. దాదాపు అరగంట పాటు ఉద్రక్త వాతావరణంలో చర్చసాగిన అనంతరం షెడ్యూల్ ప్రకారం పనులు పూర్తిచేస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వటంతో సభ సద్దుమణిగింది.












Click it and Unblock the Notifications
