ముషారఫ్ తో మాటలేమిటిః భారత్
న్యూఢిల్లీః ఖాట్మండూలో జరిగే సార్క్ సమావేశం సందర్భంగా పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషారను కలిసి చర్చలు జరిపే ప్రసక్తి లేదని భారత్ తేల్చి చెప్పింది. ఈ అంశంపై కొద్ది రోజులుగా వున్న సందిగ్ధత భారత్ ప్రకటనతో తొలగిపోయింది.
ఖాట్మండూలో భారత్ - పాక్ విదేశాంగ మంత్రుల సమావేశం కూడా జరిగే అవకాశం లేదని తేలిపోయింది. తాను పాక్ విదేశాంగ మంత్రి అబ్దుల్ సత్తార్ ను కలుసుకొనేంది లేదని రక్షణ వ్యవహారాల మంత్రివర్గ ఉపసంఘం సమావేశం అనంతరం భారత విదేశాంగ మంత్రి జస్వంత్ సింగ్ తేల్చి చెప్పారు. పాక్ చర్యలతో భారత్ మెత్తపడుతుందని, పాక్ నేతలతో చర్చలు జరుపుతుందనే ఊహాగానాలకు ఈ పరిణామాలు తెరదించాయి.












Click it and Unblock the Notifications
