భారత్ - పాక్ సరిహద్దులో భారీకాల్పులు
జమ్ముః భారత్ - పాక్ ల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు అంతర్జాతీయంగా ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతుండగా ఉభయదేశాల సరిహద్దులో శనివారం భారీ ఎత్తున కాల్పులు జరిగాయి. శనివారం ఉదయం నుంచి పూంఛ్ ప్రాంతంలో పాకిస్తాన్ సేనలు మోర్టార్లతో పెద్దఎత్తున కాల్పులు జరిపాయని భారత సైనిక అధికారులు చెప్పారు. ఈ కాల్పుల్లో ఓ భారత పౌరుడు మరణించగా ఇద్దరు గాయపడ్డారు. భారత్ కూడా ఎదురుకాల్పులు జరిపింది.
పాక్ సేనలు ఇంకా మోర్టార్లతో దాడులు జరుపుతునే వున్నాయని భారత్ సైనికాధికారులు చెప్పారు. అక్నూరు, రాజోరి సెక్టార్లలో కూడా భారత్ - పాకస్తాన్ సేనల మధ్య కాల్పులు జరుగుతున్నాయి.












Click it and Unblock the Notifications
