న్యూఢిల్లీఃభారత సైనికదళాలకు చెందిన స్థావరంలోశుక్రవారం నాడు జరిగిన పేలుళ్లు, ఘోరఅగ్నిప్రమాదంలో పదిమంది వరకు మరణించారనితెలిసింది. రాజస్తాన్‌లోని బికనూర్‌లోనికంటోన్మెంట్‌లో ఈ ఘోరం జరిగింది.మధ్యాహ్నం మూడున్నర ప్రాంతంలో 24 ఇన్‌ఫాంట్రీప్రధాన కార్యాలయంలో ఒక్కసారిగా పేలుళ్లు వినిపించాయనివాటిని వెన్నంటే మంటలు లేచాయనిఅధికారులు చెప్పారు.
ఆయుధాలుమందుగుండు సామాగ్రితో నిండిన 24 సైనిక వాహనాలుబికనూర్ నుంచి పంజాబ్‌లోని భటిండాకుబయలుదేరిన సమయంలో ఈ సంఘటనజరిగింది. సంఘటన జరిగిన ప్రాంతం పేలుళ్లతోదద్దరిల్లింది. వరసగా పేలుళ్లు భారీఎత్తున మంటలు లేవడంతో సరిహద్దులకుదగ్గరగా వున్న ఈ ప్రాంతంలోని ప్రజలు యుద్ధంప్రారంభమైందని భయంతో వణికిపోయారు.పేలుళ్ల గురించిన సమాచారం అందినవెంటనేసివిల్ అధికారుల సైనిక శిబిరానికి దగ్గరగా వున్నప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకుతరలించారు.