ఇస్లామాబాద్‌ః స్థానిక గిరిజన నేతలు ఎన్ని రకాలుగా విజ్ఞప్తి చేసిన అమెరికా వారి మొర ఆలకించకుండా అల్‌ఖైదా ఉగ్రవాదుల శిబిరాలుగా భావిస్తున్న ప్రాంతాలపై శనివారం నాడు యుద్ధవిమానాలతో ముమ్మరంగా దాడులు జరిపింది.
ఝావర్ పట్టణం పరిసర ప్రాంతాలు బాంబుల మోతతో దద్దరిల్లాయని ఇస్లామిక్ వార్తా సంస్థ వెల్లడించింది. అమెరికా విమాన దాడులను ఆపివేయాలని తూర్పు అఎn్గానిస్తాన్‌లోని పలు గిరిజన తెగలకు చెందిన పెద్దలు డిమాండ్ చేశారు. వారంతా అమెరికాకు విన్నపాలు కూడా సమర్పించారు. వారి తరఫున అఎn్గాన్ కొత్త ప్రభుత్వం కూడా విమానదాడులను నిలిపివేయాలని కోరింది. అల్‌ఖైదా, తాలిబన్ తీవ్రవాదులు ఈ చుట్టుపక్కల ఎక్కడా లేరని గిరిజన తెగల నేతలు అంటుండగా అమెరికా మాత్రం వారి మాట వినకుండా తన దారిన తాను దాడులను కొనసాగిస్తున్నది.