పోలీసు నియామకాల్లో వయోపరిమితి పెంపు.. జీఓ విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం
తెలంగాణలో పోలీస్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ ప్రకటించింది. ఎస్సై, కానిస్టేబుల్, తత్సమాన పోస్టుల(పీసీ డ్రైవర్లు మినహా) ఏజ్ లిమిట్ ను ప్రభుత్వం మరో 3 సంవత్సరాలు పెంచింది. ఈ మేరకు తాజాగా ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. గతంలో పెంచిన 7 సంవత్సరాల వయోపరిమితికి అదనంగా ఈ 3 ఏళ్లను కలపడంతో మొత్తం 10 సంవత్సరాల వయోసడలింపు లభించినట్లు అయింది. దీంతో పోలీసు, అగ్నిమాపక, జైళ్లు, ఎస్పీ ఎఫ్ విభాగాల్లో అప్లై చేసుకునే అభ్యర్థులకు భారీగా లబ్ధి చేకూరనుంది.
రాష్ట్రంలో కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి కనీస వయస్సు 18 సంవత్సరాలు కాగా.. తాజాగా మూడేళ్ల వయోపరిమితి పెంచడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితి 34 ప్లస్ 3 కలిపి మొత్తం 37 సంవత్సరాలకు చేరింది. ఇక జనరల్ అభ్యర్థులు 29 ఏళ్ల వరకు దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం ఉండేది. అలాగే ఎస్సై ఉద్యోగాలకు గతంలో పెంచిన వయో సడలింపు కారణంగా 37 సంవత్సరాల వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది.

ఇక పోలీసు, ఫైర్, జైళ్ల శాఖ, ఎస్ పీఎఫ్ విభాగాల్లో కానిస్టేబుల్ నియామకానికి వయోపరిమితి పెంచిన ప్రభుత్వం డ్రైవర్ పోస్టులకు మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. జులై 29న పోలీసు డిపార్ట్ మెంట్ లోని పలు విభాగాల్లో 4 నోటిఫికేషన్లు విడుదల అయిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే పోలీసు నియామక మండలి దరఖాస్తు గడువును పెంచింది. ఈనెల 16 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించింది.












Click it and Unblock the Notifications
