iPhone 18 Pro, iPhone 18 Pro Max సిరీస్ రిలీజ్.. ధర ఎంతంటే..? ఆ రోజు నుంచే మార్కెట్ లోకి
యాపిల్ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న వార్షిక లాంఛ్ ఈవెంట్ కొద్దిసేపటి క్రితమే కాలిఫోర్నియా కూపర్టినోలోని యాపిల్ పార్క్ లో ప్రారంభమైంది. "Surprise and Shine" అనే ట్యాగ్ లైన్ తో ఈ వేడుక స్టార్ట్ అయింది. యాపిల్ కొత్త సీఈఓగా బాధ్యతలు చేపట్టిన జాన్ టెర్నస్ నేతృత్వంలో జరుగుతున్న మొదటి మేజర్ ఈవెంట్ ఇదే కావడంతో ప్రస్తుతం 25 లక్షల మందికి పైగా లైవ్ లో వీక్షిస్తున్నారు. మరికొద్ది సేపట్లో యాపిల్ మార్కెట్ చరిత్రలోనే తొలిసారిగా ఫోల్డబుల్ ఐఫో న్‌ను పరిచయం చేసే అవకాశం ఉంది. ఇక యాపిల్ మాజీ సీఈఓ టిమ్ కుక్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి నూతన సీఈఓ జాన్ టెర్నస్ ను పరిచయం చేశారు. ఆ తర్వాత యాపిల్ సంస్థ iPhone 18 Pro సిరీస్ ను ప్రారంభించింది. రెండు కలర్స్ లో ఈ ఐఫోన్ మార్కెట్లోకి వచ్చింది. గ్లేషియర్, బర్గాండీ కలర్స్ తో ఇది అందుబాటులోకి వచ్చింది.
అలాగే మ్యాక్స్ వేరియంట్ తో పాటు ఇంటెలిజెన్స్, పనితనం, బ్యాటరీ లైఫ్, కెమెరా సామర్థ్యం లో అడ్వాన్స్ డ్ టెక్నాలజీతో వచ్చినట్లు కొత్త సీఈఓ జాన్ టెర్నస్ వెల్లడించారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఐఫోన్ 17 ప్రో, 17 ప్రో మ్యాక్స్ మోడల్స్ తో పోలిస్తే ఇవి కొన్ని సరికొత్త అప్ గ్రేడ్స్‌తో రూపొందించినట్లు తెలిపారు.
అత్యాధునిక ఏఐ ఫీచర్లతో కూడిన సరికొత్త ఐఫోన్ 18 ప్రో, ప్రో మ్యాక్స్ మోడల్స్ యాపిల్స్ లవర్స్ తో పాటు సాధారణ మొబైల్ యూజర్స్ కు పిచ్చెక్కిస్తున్నాయి. వీటితోపాటు న్యూ టెక్నాలజీతో కొత్త తరం యాపిల్ వాచ్ సిరీస్, అప్ గ్రేడెడ్ ఎయిర్ పాడ్స్ ను కూడా యాపిల్ సీఈఓ జాన్ టెర్నస్ విడుదల చేశారు. అలాగే లాంగ్ లాంగ్వేజ్ మాడ్యూల్స్ కోసం A20 ప్రో చిప్ ను యాపిల్ సంస్థ విడుదల చేసింది. ఇక యాపిల్ రిఫరెన్స్ ఇమేజ్ ఆప్షన్ ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం మార్కెట్ లో ఇష్టారీతిన పెరిగిన ఏఐ జనరేటెడ్ ఇమేజినెరీ, డిజిటల్ మానిపులేషన్ ను తట్టుకునే విధంగా ఈ సరికొత్త ఫీచర్ ను తీసుకొచ్చినట్లు సీఈఓ జాన్ టెర్నస్ తెలిపారు.

ఇక iPhone 18 Pro ప్రీ ఆర్డర్స్ సెప్టెంబర్ 12 నుంచి ప్రారంభం కానున్నాయి. iPhone 18 Pro ధరలు చూస్తే 1,999 డాలర్ల నుంచి ప్రారంభం కానుంది. అలాగే iPhone 18 Pro Max ధర 1,299 డాలర్ల నుంచి స్టార్ట్ కానుంది. ఇక సెప్టెంబర్ 18 నుంచి మార్కెట్లోకి విడుదల కానున్నట్లు యాపిల్ సంస్థ వెల్లడించింది.












Click it and Unblock the Notifications
