సూర్య కొత్త సినిమాకు విచిత్రమైన టైటిల్.. ఏడాదిలో ముచ్చటగా మూడో సినిమాతో విధ్వంసం..
కోలీవుడ్ స్టార్ హీరో సినిమాల విషయంలో జెట్ స్పీడ్ తో దూసుకెళ్తున్నారు. సాధారణంగా పెద్ద హీరోలు ఏడాదికి ఒక్క సినిమాతో రావడమే గగనం అనుకునే రోజుల్లో ఈ ఏడాది ఏకంగా మూడు సినిమాలతో బాక్సాఫీస్ వద్ద రచ్చ చేస్తున్నారు సూర్య. గతంలో కంగువా, రెట్రో సినిమాలతో ఫ్యాన్స్ ను డిజపాయింట్ చేసిన కోలీవుడ్ స్టార్ హీరో ఇప్పుడు మాత్రం మూడు నెలలకో సినిమాతో ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ పెడుతున్నారు. ఈ ఏడాది ఇప్పటికే రెండు బ్లాక్ బస్టర్ సినిమాలు అందించారు సూర్య. కరుప్పు తెలుగులో వీరభద్రుడు మూవీ ఈ ఏడాది మే 15 న విడుదలైంది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. సూర్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ కమ్ బ్యాక్ హిట్ గా నిలిచింది. తెలుగులో వీరభద్రుడు టైటిల్ తో రిలీజ్ అయిన ఈ మూవీ ఇక్కడ కూడా సూపర్ హిట్ అయింది.

ఆ తర్వాత టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య 'విశ్వనాథ్ అండ్ సన్స్' అనే మూవీ చేసిన సంగతి తెలిసిందే. ఈ మూవీ ఆగస్ట్ 14న విడుదలైంది. ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా తమిళులను పెద్దంతగా ఆకట్టుకోలేదు కానీ తెలుగులో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 250 కోట్లకుపైగా కలెక్షన్స్ నమోదు చేసింది. అంతేకాక ఓవర్సీస్ లోనూ 2 మిలియన్ డాలర్ల వసూళ్లను రాబట్టింది. ఇక తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. సెప్టెంబర్ 11 నుంచి నెట్ ఫ్లిక్స్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ కు రానుంది.
ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమాను దించేశారు సూర్య. అదే యంగ్ డైరెక్టర్ జీతూ మాధవన్ దర్శకత్వంలో చేస్తున్న 'సీన్' మూవీ. ఈ మేరుకు తాజాగా ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ రిలీజ్ అయింది. ఆవేశం, రోమాంచమ్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు కావడంతో ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. సీన్ మూవీలో సూర్య సరసన నజ్రియా నజీమ్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ప్రేమలు, కొత్త లోక సినిమాల హీరో నస్లెన్ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇక మలయాళ సంగీత దర్శకుడు సుశిన్ శ్యామ్ సీన్ సినిమాకు స్వరాలు సమకూర్చుతున్నాడు. ఈ ఏడాది దీపావళి కానుకగా నవంబర్ 6 న చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా వెల్లడించింది. దీంతో ఈ ఏడాది మూడు సినిమాలను రిలీజ్ చేసిన హీరోగా సూర్య రికార్డు సృష్టించారనే చెప్పాలి.












Click it and Unblock the Notifications
