11 మందిని బలి గొన్న ఉగ్రవాదులు
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌లోని ఫూంచ్ జిల్లాలో గల ఒక గ్రామంలో ఉగ్రవాదులు మూడు ముస్లిం కుటుంబాలపై 11 మందిని దారుణంగా కాల్చి వేశారు. ఈ కాల్పుల్లో మరణించినవారిలో ఎనమండుగురు పిల్లలు, ఒక మహిళ వున్నారు. ఈ సంఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన ఆదివారం రాత్రి సంభవించినట్లు పోలీసులు సోమవారం తెలియజేశారు.
దీనికి తోడు, ఉత్తర ప్రదేశ్‌కు చెందిన మక్సూద్ అహ్మద్‌ను హత్య చేశారు. గ్రామంలోనిస్పెషల్ పోలీసు ఆఫీసర్ మొహమ్మద్ నజీర్‌ను కిడ్నాప్ చేశారు. జైష్- ఎ- మొహమ్మద్ గానీ, లష్కర్- ఎ- తోయిబా గానీ ఈ దారుణానికి పాల్పడి వుండవచ్చునని ఇంటలిజెన్స్ అధికారులు అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications
