గ్రామల్లో ప్రైవేట్ పనులు: వెంకయ్య
హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని పనులను ప్రైవేట్ వ్యక్తులకు, సంస్థలకు అప్పగిస్తామని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి ఎం. వెంకయ్యనాయుడు చెప్పారు. గ్రామీణాభివృద్ధి నిధికి నిధులను సేకరిస్తామని ఆయన మంగళవారం విలేకరుల సమావేశంలో చెప్పారు.
ఇటీవలి మినీ మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం, బిజెపి మరింత సఖ్యతగా వ్యవహరించి వుంటే ఇంకా మంచి ఫలితాలు వచ్చి వుండేవని ఆయన అభిప్రాయపడ్డారు. కింది స్థాయిలో ఇరు పార్టీల మధ్య సంబంధాలను మరింత పటిష్టం చేసుకోవాలని మాత్రమే తాను సూచిస్తున్నానని ఆయన అన్నారు. అయోధ్యవివాదాన్ని వచ్చే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో వాడుకోవాలని ప్రతిపక్షాలుప్రయత్నిస్తున్నాయని, వారికి ఎదురు దెబ్బ తగులుతుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
