సంపన్న రాజ్యాలపై ప్రధాని ఆగ్రహం
న్యూఢిల్లీః స్వేచ్ఛావాణిజ్యం విషయంలో అభివృద్ధి చెందిన దేశాలు ద్వంద్వ ప్రమాణాలు అనుసరిస్తున్నాయని ప్రధాన మంత్రి ఎబి వాజ్‌పేయి ఆరోపించారు. అవి విధించిన అసమంజసమైన ఆంక్షల కారణంగా భారతీయ ఉక్కు, తత్‌సంబంధిత రంగాలు తీవ్రంగా నష్టపోయాయని ఆయన పేర్కొన్నారు. గురువారం నాడు ఆయన ఉక్కురంగానికి చెందిన నిపుణుల సమావేశంలో పాల్గొన్నారు. అభివృద్ధి చెందిన దేశాలు స్వేచ్ఛావాణిజ్య మంత్రం పఠిస్తూ వర్ధమాన రాజ్యాల మార్కెట్లను కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు.












Click it and Unblock the Notifications
