న్యూఢిల్లీః గుజరాత్‌లోని ఐఎస్‌ఐ ఏజెంట్లు, తీవ్రవాద వర్గాల రహస్య స్థావరాన్ని పోలీసులు ధ్వంసం చేశారు. ఢిల్లీ, గుజరాత్ పోలీసులు సంయుక్తంగా జరిపిన దాడిలో ముగ్గురు హర్కత్ ఉల్ జిహాదీ ఇస్లామీ మిలిటెంట్లు అరెస్టయ్యారు.
ఐఎస్‌ఐ తరఫున సూరత్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ ముగ్గురు టెర్రరిస్టుల నుంచిపెద్ద ఎత్తన ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని కూడాస్వాధీనం చేసుకున్నారు. కోల్‌కతాలోని అమెరికన్‌సెంటర్‌పై దాడితో ప్రత్యక్ష్య సంబంధం వున్నఅఫ్తబ్ అన్సారీకి అరెస్టయిన ముగ్గురికీ సన్నిహిత సంబంధాలు వున్నాయని పోలీసులు చెప్పారు. ఈ తీవ్రవాదలు అనేక సార్లు పాకిస్తాన్‌కు వెళ్లివచ్చారని ఐఎస్‌ఐ శిక్షణ శిబిరాల్లో పాల్గొన్నారని ఆయన చెప్పారు.