అయోధ్యః అయోధ్యలో రామాలయ నిర్మాణం ఎవరెన్ని చెప్పినా ఆగదని విశ్వహిందూ పరిషత్ ప్రకటించింది.
ఆదివారం నాడువివాదరహిత స్థలంలో విహెచ్‌పి నేత అశోక్ సింఘాల్ సమక్షంలో సాధువులు సంత్‌లు తాజాగా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఆయోధ్య పరిష్కారానికి తాము చేస్తున్న ప్రయత్నాలు ఫలించక పోవడానికి ఉభయపక్షాల మొండివైఖరే కారణమంటూ ప్రధాని చేసిన ప్రకటన పట్ల విహెచ్‌పి నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయోధ్యలో ఆలయ నిర్మాణానికి సంబంధించి తాము గత ఏడాది కుంభమేళా సమయంలోనే తేదీలను ప్రకటించామని వారు తెలిపారు. ఏడాది కింద ప్రకటించిన తేదీలకు తాము కట్టుబడి వుంటే ప్రభుత్వం తమవైపు వేలెత్తి చూపించడంలోఅర్ధం లేది వారు స్పష్టం చేశారు.