షేక్ వాంగ్మూలం వార్త నిరాధారం: పాక్
ఇస్లామాబాద్: అమెరికా జర్నలిస్టు డేనియల్‌పెర్ల్ కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడైనషేక్ ఒమర్ వాంగ్మూలానికి సంబంధించి వచ్చిన వార్త నిరాధారమైందని, ఊహాగానమని పాకిస్థాన్ కొట్టిపారేసింది. భారత పార్లమెంటుపై, జమ్మూ కాశ్మీర్‌అసెంబ్లీపై, కోల్‌కత్తాలోని అమెరికా సమాచార కేంద్రంపై దాడులతో తనకు సంబంధం వున్నదనిషేక్ ఒమర్ అంగీకరించినట్లు ది న్యూస్ అనే పత్రిక రాసింది.
ఆ పత్రిక రాసిన వార్త నిరాధారమైందని, ఊహాగానమని, దాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని పాకిస్థాన్ విదేశాంగ శాఖ కార్యాలయం ప్రతినిధి అజీజ్ అహ్మద్‌ఖాన్ విలేకరులతో అన్నారు.
ప్రతి ఊహాగానంతో కూడిన వార్తను ఖండించుకుంటూ పోతే అది పత్రికల్లో రావడం ప్రారంభమవుతుందని, ఇది ఇబ్బందిగా పరిణమిస్తుందని, ఈ కేసులో పాకిస్థాన్ ప్రభుత్వ ప్రతినిధి చెప్పే మాటలనే మీడియా పరిగణనలోకి తీసుకోవాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
