ప్రత్యూష హంతకుల్ని శిక్షించాలిఃబాబూమోహన్
హైదరాబాద్‌ః సినీ నటి ప్రత్యూష అనుమానాస్పద మృతి విషయాన్ని తెలుగుదేశం ఎమ్మెల్ల్యే, సినీ నటుడు బాబూ మోహన్ బుధవారం అసెంబ్లీలో ప్రస్తావించారు. అసెంబ్లీ జీరో అవర్ లో బాబూ మోహన్ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ వర్థమాన తార ప్రత్యూష ఆకస్మిక మరణం సినీ రంగాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు.
ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం వున్నదని బాబూ మోహన్ అభిప్రాయ పడ్డారు.












Click it and Unblock the Notifications
